మీ చిన్నారికి, వారి సొంత Google ఖాతా లేదా ప్రొఫైల్ ఉండాలంటే, ఈ గోప్యతా ప్రకటనలోను, Google గోప్యతా పాలసీలోను వివరించిన విధంగా, మీ చిన్నారి సమాచారాన్ని సేకరించడానికి, ఉపయోగించడానికి లేదా బహిర్గతం చేయడానికి మాకు మీ అనుమతి అవసరం కావచ్చు. మా సర్వీస్‌లను ఉపయోగించడానికి మీ చిన్నారిని మీరు అనుమతించినప్పుడు, మీ సమాచార భద్రత విషయంలో మీరు, మీ చిన్నారి మాపై నమ్మకం ఉంచుతారు. ఇది ఒక పెద్ద బాధ్యత అని మేము అర్థం చేసుకున్నాము. మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి, అలాగే దాన్ని మీ కంట్రోల్‌లో ఉంచడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. వెబ్ & యాప్ యాక్టివిటీని, YouTube హిస్టరీని, వర్తించే ప్రాంతాలను, నిర్దిష్ట Google సర్వీస్‌లను లింక్ చేయడానికి సంబంధించి, మీ చిన్నారి, వారి యాక్టివిటీ కంట్రోల్స్‌ను మేనేజ్ చేయవచ్చో లేదో మీరు ఎంచుకోవచ్చు.
13 ఏళ్ల లోపు (లేదా మీ దేశంలో వర్తించే వయస్సు లోపు) వయస్సు ఉండే పిల్లల విషయంలో, Family Linkతో మేనేజ్ చేయబడుతున్న Google ఖాతాలు, ప్రొఫైల్స్‌కు సంబంధించిన ఈ గోప్యతా ప్రకటన, అలాగే Google గోప్యతా పాలసీ Google పాటించే గోప్యతా పద్ధతులను వివరిస్తాయి. ప్రత్యేకంగా మీ చిన్నారి ఖాతా లేదా ప్రొఫైల్ కోసం గోప్యతా పద్ధతులు ఉంటే (ఉదాహరణకు, వ్యక్తిగతీకరించిన అడ్వర్టయిజింగ్ విషయంలో విధించబడే పరిమితులకు సంబంధించినవి), ఆ తేడాలను ఈ గోప్యతా ప్రకటనలో వివరించడం జరుగుతుంది.
ఈ గోప్యతా ప్రకటన మీ చిన్నారి ఉపయోగించే అవకాశం ఉన్న ఏవైనా థర్డ్-పార్టీ (Google యేతర) యాప్‌లు, చర్యలు లేదా వెబ్‌సైట్‌ల ప్రాక్టీసులకు వర్తించదు. మీరు థర్డ్-పార్టీ యాప్‌లు, చర్యలు, ఇంకా సైట్‌లకు వర్తించే నియమాలను, పాలసీలను రివ్యూ చేసి, వాటి డేటా కలెక్షన్, ఇంకా వినియోగ ప్రాక్టీసులతో పాటు అవి మీ చిన్నారికి సముచితంగా ఉన్నాయా లేదా అనేది మీరు నిర్ణయించవచ్చు.
మీ చిన్నారి Google ఖాతా లేదా ప్రొఫైల్‌ను కలిగి ఉండటానికి మీరు ఒకసారి అనుమతిని ఇచ్చాక, మేము సేకరించే సమాచారం విషయంలో వారి ఖాతా లేదా ప్రొఫైల్ సాధారణంగా మీ స్వంత ఖాతా లేదా ప్రొఫైల్‌లాగానే పరిగణించబడుతుంది. ఉదాహరణకు, మేము వీటిని సేకరిస్తాము:
ఖాతాను లేదా ప్రొఫైల్‌ను క్రియేట్ చేసే ప్రాసెస్‌లో భాగంగా, మేము మొదటి, చివరి పేరు, ఈమెయిల్ అడ్రస్, పుట్టిన తేదీ లాంటి వ్యక్తిగత సమాచారాన్ని అడగవచ్చు. మీరు లేదా మీ చిన్నారి అందించే, మీ ఆన్‌లైన్ కాంటాక్ట్ వివరాల వంటి సమాచారాన్ని మేము సేకరిస్తాము, అది మాకు మీ సమ్మతిని రిక్వెస్ట్ చేయడానికి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కోసం అవసరం అవుతుంది. తమ ఖాతాను లేదా ప్రొఫైల్‌ను ఉపయోగించే సమయంలో మీ చిన్నారి Google Photosకు ఫోటోను సేవ్ చేయడం లేదా Google Driveలో డాక్యుమెంట్‌ను క్రియేట్ చేయడం వంటి వాటి ద్వారా, మీ చిన్నారి క్రియేట్ చేసిన, అప్‌లోడ్ చేసిన, లేదా ఇతరుల నుండి అందుకున్న సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాము.
మీ చిన్నారి ఉపయోగించే సర్వీస్‌లు, వాటిని మీ చిన్నారి ఉపయోగించే పద్ధతి గురించి మేము నిర్దిష్ట సమాచారాన్ని ఆటోమేటిక్‌గా సేకరించి, స్టోర్ చేస్తాము, అంటే మీ చిన్నారి Google Searchలో క్వెరీని ఎంటర్ చేయడం, Google Assistantతో మాట్లాడటం, లేదా YouTube Kidsలో వీడియోను చూడటం వంటివి చేసినప్పుడు. ఈ సమాచారంలో ఇవి ఉంటాయి:
Google సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి మీ చిన్నారి ఉపయోగించే యాప్‌లు, బ్రౌజర్‌లు, పరికరాలతో పాటు విశిష్ట ఐడెంటిఫయర్‌లు, బ్రౌజర్ రకం, సెట్టింగ్‌లు, పరికర రకం, సెట్టింగ్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ నెట్‌వర్క్ సమాచారంతో సహా క్యారియర్ పేరు, ఫోన్ నంబర్, అప్లికేషన్ వెర్షన్ సంఖ్య గురించి మేము సమాచారాన్ని సేకరిస్తాము. IP అడ్రస్, క్రాష్ రిపోర్ట్‌లు, సిస్టమ్ యాక్టివిటీ, మీ చిన్నారి రిక్వెస్ట్ తేదీ, సమయం, రెఫర్ చేసినవారి URLతో సహా మా సర్వీస్‌లతో మీ చిన్నారి యాప్‌లు, బ్రౌజర్‌లు, పరికరాలు చేసే ఇంటరాక్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాము. ఉదాహరణకు, మీ చిన్నారి Play Store నుండి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే సందర్భంలో తన పరికరంలోని ఒక Google సర్వీస్‌తో మా సర్వర్‌లను సంప్రదించినప్పుడు మేము ఈ సమాచారాన్ని సేకరిస్తాము.
మేము మా సర్వీస్‌లలో మీ చిన్నారి యాక్టివిటీ గురించి సమాచారాన్ని సేకరిస్తాము, ఇది వారు Google Playలో ఇష్టపడగల యాప్‌లను సిఫార్సు చేయడం లాంటి అంశాల కోసం ఉపయోగించబడుతుంది. మీ చిన్నారి, వారి యాక్టీవిటీ కంట్రోల్స్‌ను మేనేజ్ చేయవచ్చో లేదో మీరు ఎంచుకోవచ్చు. మేము సేకరించే మీ చిన్నారి యాక్టివిటీ సమాచారంలో సెర్చ్ క్వెరీలు, వారు చూసే వీడియోలు, వారు ఆడియో ఫీచర్‌లను ఉపయోగించినప్పడు, వాయిస్ ఇంకా ఆడియో సమాచారాన్ని, వారు కాంటాక్ట్ చేసే లేదా కంటెంట్‌ను షేర్ చేసే వ్యక్తులు, వారు తమ Google ఖాతాతో సింక్ చేసిన Chrome బ్రౌజింగ్ హిస్టరీ వంటివి ఉండవచ్చు. మీ చిన్నారి కాల్స్ చేయడానికి, అందుకోవడానికి లేదా మెసేజ్‌లను పంపడానికి, అందుకోవడానికి మా సర్వీస్‌లను అంటే ఉదాహరణకు Google Meet లేదా Duoను ఉపయోగిస్తుంటే, మేము ఆ టెలిఫోన్ లాగ్ సమాచారాన్ని సేకరించవచ్చు. మీ చిన్నారి వారి ఖాతా లేదా ప్రొఫైల్‌లో సేవ్ చేయబడిన యాక్టివిటీ సమాచారాన్ని కనుగొని, మేనేజ్ చేయడానికి వారి Google ఖాతాను సందర్శించవచ్చు. మీరు కూడా చిన్నారి Google ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా, లేదా Family Linkలో వారి ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయడం ద్వారా వారి యాక్టివిటీ సమాచారాన్ని మేనేజ్ చేయడంలో సహాయపడవచ్చు.
మీ చిన్నారి మా సర్వీస్‌లను ఉపయోగించినప్పుడు మేము వారి లొకేషన్ గురించి సమాచారాన్ని సేకరిస్తాము. GPS, IP అడ్రస్, వారి పరికరం నుండి సెన్సార్ డేటా, వారి పరికరానికి సమీపంలో ఉన్న Wi-Fi యాక్సెస్ పాయింట్‌లు, సెల్ టవర్‌లు, బ్లూటూత్ ప్రారంభించబడిన పరికరాల వంటి వాటి గురించి సమాచారం ఆధారంగా మీ పిల్లల లొకేషన్ గుర్తించబడుతుంది. మేము సేకరించే లొకేషన్ డేటా రకాలు మీ సెట్టింగ్‌లు, మీ పిల్లల పరికరాలపై కొంతవరకు ఆధారపడి ఉంటాయి.
మేము మీ చిన్నారి వాయిస్, ఆడియో సమాచారాన్ని సేకరించవచ్చు. ఉదాహరణకు, మీ చిన్నారి Assistantను ఒక ప్రశ్న అడగడానికి ఆడియో యాక్టివేషన్ కమాండ్‌లను ఉపయోగించినప్పుడు (ఉదా., "Ok Google" లేదా మైక్రోఫోన్ చిహ్నాన్ని తాకడం), వారి రిక్వెస్ట్‌కు ప్రతిస్పందించడానికి కింది స్పీచ్/ఆడియోకు సంబంధించిన రికార్డింగ్ ప్రాసెస్ చేయబడుతుంది. అదనంగా, వెబ్ & యాప్ యాక్టివిటీ సెట్టింగ్ కింద ఉండే, మీ చిన్నారికి సంబంధించిన వాయిస్ & ఆడియో యాక్టివిటీ ఆప్షన్ ఎంచుకోబడి ఉంటే, సైన్ ఇన్ చేసిన పరికరంలో Assistantతో వారి వాయిస్ ఇంటరాక్షన్‌కు సంబంధించిన రికార్డింగ్ (అలాగే కొన్ని సెకన్ల ముందు సమయానికి సంబంధించిన రికార్డింగ్) వారి ఖాతాలో స్టోర్ చేయబడవచ్చు.
మీ చిన్నారి సమాచారాన్ని సేకరించి, స్టోర్ చేయడం కోసం మేము కుక్కీలు, పిక్సెల్ ట్యాగ్‌లు, లోకల్ స్టోరేజ్, అంటే బ్రౌజర్ వెబ్ స్టోర్ లేదా అప్లికేషన్ డేటా కాష్‌లు, డేటాబేస్‌లు, సర్వర్ లాగ్‌లు వంటి వాటితో సహా అనేక రకాల టెక్నాలజీలను ఉపయోగిస్తాము. ఈ ఖాతాలు లేదా ప్రొఫైల్‌ల కోసం అందుబాటులో ఉన్న Google ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను ఉపయోగించడానికి అవసరమైన సముచిత సమాచారం తప్ప, మేము మీ చిన్నారిని మరింత వ్యక్తిగత సమాచారం కోసం అభ్యర్థించము.
మీ పిల్లల Google ఖాతా లేదా ప్రొఫైల్‌తో అనుబంధంగా Google సేకరించే డేటాను మేము ఎలా ఉపయోగించవచ్చో Google గోప్యతా పాలసీ మరింత వివరంగా వివరిస్తుంది. సాధారణంగా, మేము మీ చిన్నారికి చెందిన సమాచారాన్ని వీటి కోసం ఉపయోగిస్తాము: మా సర్వీస్‌లను అందించడం, నిర్వహించడం, మెరుగుపరచడం; కొత్త సర్వీస్‌లను డెవలప్ చేయడం; మీ చిన్నారి కోసం మా సర్వీస్‌లను అనుకూలంగా మార్చడం; మా సర్వీస్‌ల పనితీరు, వాటిని ఉపయోగించే పద్ధతిని అంచనా వేయడం; మా సర్వీస్‌లకు సంబంధించి నేరుగా మీ చిన్నారితో మాట్లాడటం; మా సర్వీస్‌ల భద్రత, విశ్వసనీయతను మెరుగుపరచడంలో సహాయపడటం.
ఈ అవసరాల కోసం మీ చిన్నారి సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మేము వివిధ టెక్నాలిజీలను ఉపయోగిస్తాము. అనుకూలీకరించబడిన సెర్చ్ ఫలితాలు లేదా మా సర్వీస్‌లను మీ చిన్నారి ఉపయోగించే పద్ధతులకు అనువుగా రూపొందించబడిన ఫీచర్‌లు లాంటి వాటిని అందించడానికి మీ చిన్నారి కంటెంట్‌ను విశ్లేషించడానికి మేము ఆటోమేటెడ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తాము. మేము స్పామ్, మాల్‌వేర్, అలాగే చట్టవిరుద్ధమైన కంటెంట్ వంటి దుర్వినియోగాన్ని గుర్తించడంలో సహాయపడటానికి మీ చిన్నారి కంటెంట్‌ను విశ్లేషిస్తాము. డేటాలోని నమూనాలను గుర్తించడం కోసం మేము అల్గారిథమ్‌లు కూడా ఉపయోగిస్తాము. మేము మా సిస్టమ్‌లలో మా పాలసీలను ఉల్లంఘిస్తున్న స్పామ్, మాల్‌వేర్, చట్టవిరుద్ధమైన కంటెంట్, ఇతర రకాల దుర్వినియోగాలను గుర్తించినప్పుడు, వారి ఖాతాను లేదా ప్రొఫైల్‌ను డిజేబుల్ చేయవచ్చు లేదా మరో రకమైన సముచితమైన చర్యను తీసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో, ఉల్లంఘన గురించి మేము అధికారిక సంస్థలకు కూడా రిపోర్ట్ చేయవచ్చు.
మీ చిన్నారి సెట్టింగ్‌ల ఆధారంగా, సిఫార్సులు, వ్యక్తిగతీకరించిన కంటెంట్, అనుకూలంగా మార్చిన సెర్చ్ ఫలితాలను అందించడానికి, మేము మీ చిన్నారికి చెందిన సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీ చిన్నారి సెట్టింగ్‌ల ఆధారంగా, వారు ఇష్టపడగల కొత్త యాప్‌లను సూచించడానికి, Google Play మీ చిన్నారి ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల లాంటి సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
దానితో పాటుగా, మీ చిన్నారి సెట్టింగ్‌లను బట్టి, పైన వివరించిన ప్రయోజనాల కోసం మేము మా సర్వీస్‌ల నుండి, మీ చిన్నారి పరికరం నుండి సేకరించే సమాచారాన్ని జతచేయవచ్చు. మీ చిన్నారి ఖాతా లేదా ప్రొఫైల్ సెట్టింగ్‌ల ఆధారంగా, Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి, మీ చిన్నారి వ్యక్తిగత సమాచారాన్ని ఇతర సైట్‌లు, యాప్‌లలోని వారి యాక్టివిటీతో అనుబంధించవచ్చు.
Google మీ చిన్నారికి వ్యక్తిగతీకరించిన యాడ్‌లను అందించదు, అంటే మీ పిల్లల ఖాతా లేదా ప్రొఫైల్‌లోని సమాచారం ఆధారంగా యాడ్‌లు ఉండవు. బదులుగా, మీ చిన్నారి చూస్తున్న వెబ్‌సైట్ లేదా యాప్ కంటెంట్, ప్రస్తుత సెర్చ్ క్వెరీ లేదా సాధారణ లొకేషన్ (నగరం లేదా రాష్ట్రం వంటివి) లాంటి సమాచారం ఆధారంగా యాడ్‌లు చూపబడవచ్చు. వెబ్ లేదా Googleకు చెందని యాప్‌లను బ్రౌజ్ చేస్తున్నప్పుడు, మీ చిన్నారికి ఇతర (Googleకు చెందని) ప్రదాతల యాడ్‌లతో పాటు థర్డ్ పార్టీల అందించే వ్యక్తిగతీకరించిన యాడ్‌లతో కనిపించవచ్చు.
మీ చిన్నారి వారి Google ఖాతాతో లేదా ప్రొఫైల్‌తో సైన్ ఇన్ చేసినప్పుడు, ఫోటోలు, వీడియోలు, ఆడియో, లొకేషన్‌తో సహా సమాచారాన్ని పబ్లిక్‌గా, అలాగే ఇతరులతో షేర్ చేయగలరు. మీ చిన్నారి సమాచారాన్ని పబ్లిక్‌గా షేర్ చేసినప్పుడు, Google Search వంటి సెర్చ్ ఇంజిన్‌ల ద్వారా దాన్ని యాక్సెస్ చేయవచ్చు.
మేము సేకరించిన సమాచారాన్ని పరిమిత సందర్భాలలో Google వెలుపలి వారితో షేర్ చేయవచ్చు. కింది సందర్భాలలో మినహా, మేము వ్యక్తిగత సమాచారాన్ని Google వెలుపలి కంపెనీలు, సంస్థలు, అలాగే వ్యక్తులతో షేర్ చేయము:
సమ్మతితో (వర్తించే విధంగా) మేము వ్యక్తిగత సమాచారాన్ని Google వెలుపల షేర్ చేస్తాము.
మీ చిన్నారి పేరు, ఫోటో, ఈమెయిల్ అడ్రస్, అలాగే Play కొనుగోళ్లతో పాటు వారి సమాచారాన్ని Googleలో ఉన్న మీ ఫ్యామిలీ గ్రూప్‌లోని మెంబర్‌లతో షేర్ చేయవచ్చు.
మేము మా సూచనల ఆధారంగా, అలాగే ఈ గోప్యతా ప్రకటన, Google గోప్యతా పాలసీ, అలాగే ఏవైనా ఇతర సముచితమైన గోప్యత, ఇంకా భద్రతా చర్యలకు అనుగుణంగా వ్యక్తిగత సమాచారాన్ని మా కోసం ప్రాసెస్ చేయడానికి మా అనుబంధ సంస్థలు లేదా ఇతర విశ్వసనీయ బిజినెస్‌లు లేదా వ్యక్తులకు అందిస్తాము.
సమాచారానికి చెందిన యాక్సెస్, ఉపయోగం, ప్రదర్శన లేదా బహిర్గతం చేయడం వీరికి అవసరమైన సహేతుకమైనదని మాకు ఉత్తమమైన నమ్మకం ఉంటే, మేము Google వెలుపల ఉన్న కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తాము:
ఏదైనా వర్తించే చట్టానికి, నియమానికి, చట్టపరమైన ప్రక్రియ లేదా ఆచరణీయ ప్రభుత్వ రిక్వెస్ట్‌కు లోబడి ఉండటానికి;
సంభావ్య ఉల్లంఘనల విచారణతో సహా వర్తించదగిన సర్వీస్ నియమాలను అమలు చేయడానికి;
మోసం, భద్రత లేదా టెక్నికల్ సమస్యలను గుర్తించడం, నివారించడానికి లేదా పరిష్కరించడానికి.
చట్టానికి అవసరమైనట్లుగా లేదా ఆమోదించినట్లుగా Google, మా యూజర్‌లు లేదా పబ్లిక్ యొక్క హక్కులకు, ఆస్తికి లేదా భద్రతకు హాని కలిగించే వాటికి వ్యతిరేకంగా రక్షించడానికి.
మేము వ్యక్తిగతంగా గుర్తించలేని సమాచారాన్ని (మా సర్వీస్‌ల సాధారణ ఉపయోగానికి సంబంధించిన ట్రెండ్‌లు వంటివి) పబ్లిక్‌గా, మా పార్ట్‌నర్‌లైన — పబ్లిషర్‌లు, అడ్వర్టయిజర్లు, డెవలపర్లు లేదా హక్కుదారులు వంటి వారితో కూడా షేర్ చేయవచ్చు. ఉదాహరణకు, మా సర్వీస్‌ల యొక్క సాధారణ వినియోగ ట్రెండ్‌లను చూపడానికి మేము సమాచారాన్ని పబ్లిక్‌గా షేర్ చేస్తాము. నిర్దిష్ట పార్ట్‌నర్‌లు అడ్వర్టయిజింగ్, అలాగే అంచనా అవసరాల కోసం వారి స్వంత కుక్కీలు లేదా అటువంటి టెక్నాలిజీలను ఉపయోగించి మీ బ్రౌజర్‌లు లేదా పరికరాల నుండి సమాచారాన్ని సేకరించడానికి కూడా మేము వారిని అనుమతిస్తాము.
మీ చిన్నారికి Google ఖాతా ఉన్నట్లయితే, మీరు వారి Google ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా మీ చిన్నారి సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు, అప్‌డేట్ చేయవచ్చు, తీసివేయవచ్చు, ఎగుమతి చేయవచ్చు, ప్రాసెస్ విధానాన్ని నియంత్రించవచ్చు. మీకు మీ చిన్నారి పాస్‌వర్డ్ గుర్తులేకపోతే, మీరు దాన్ని Family Link యాప్ లేదా వెబ్‌లోని Family Link సెట్టింగ్‌ల ద్వారా రీసెట్ చేయవచ్చు. సైన్ ఇన్ చేసిన తర్వాత, మీరు మీ పిల్లల గోప్యతా సెట్టింగ్‌లు, ఇంకా సమాచారాన్ని మేనేజ్ చేయడంలో సహాయపడటానికి Google యాక్టీవిటీ కంట్రోల్స్ వంటి Google గోప్యతా పాలసీలో వివరించిన వివిధ నియంత్రణలను ఉపయోగించవచ్చు.
మీ చిన్నారికి ప్రొఫైల్ ఉన్నట్లయితే, మీరు Family Link యాప్ లేదా వెబ్‌లోని Family Link సెట్టింగ్‌ల ద్వారా మీ పిల్లల సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు, అప్‌డేట్ చేయవచ్చు, తీసివేయవచ్చు, ఎగుమతి చేయవచ్చు, అలాగే ప్రాసెసింగ్‌ను పరిమితం చేయవచ్చు.
మీ చిన్నారి, “నా యాక్టివిటీ”లో వారి గత యాక్టివిటీని తొలగించగలరు, ఆటోమేటిక్‌గా, థర్డ్ పార్టీలకు యాప్ అనుమతులను (పరికర లొకేషన్, మైక్రోఫోన్, లేదా కాంటాక్ట్‌లు వంటి వాటితో సహా) మంజూరు చేయగలరు. మీరు మీ చిన్నారి Google ఖాతా లేదా ప్రొఫైల్ సమాచారాన్ని ఎడిట్ చేయడానికి లేదా మార్చడానికి, యాప్ యాక్టివిటీని, యాప్ అనుమతులను రివ్యూ చేయడానికి, కొన్ని యాప్‌లు లేదా థర్డ్ పార్టీ సర్వీస్‌లకు మీ చిన్నారి సమాచారానికి యాక్సెస్‌ను ఇవ్వడం కోసం నిర్దిష్ట అనుమతులను ఇవ్వడంలో మీ చిన్నారి సామర్థ్యాన్ని మేనేజ్ చేయడానికి Family Linkను ఉపయోగించవచ్చు.
మీరు ఎప్పుడైనా మీ చిన్నారి సమాచారాన్ని సేకరించడాన్ని లేదా ఉపయోగించడాన్ని ఆపివేయాలనుకుంటే, Family Link యాప్‌లోని లేదా వెబ్‌లో Family Link సెట్టింగ్‌లలో మీ చిన్నారి ఖాతా లేదా ప్రొఫైల్ సమాచారం పేజీలో “ఖాతాను తొలగించండి” లేదా “ప్రొఫైల్‌ను తొలగించండి” అనే ఆప్షన్‌లను క్లిక్ చేయడం ద్వారా మీ చిన్నారికి చెందిన Google ఖాతా లేదా ప్రొఫైల్‌ను తొలగించవచ్చు. మీ చిన్నారికి చెందిన ఖాతా లేదా ప్రొఫైల్ సమాచారం సమంజసమైన వ్యవధిలో శాశ్వతంగా తొలగించబడుతుంది.
మీ చిన్నారి Google ఖాతా లేదా ప్రొఫైల్‌కు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించవద్దు. సాయం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాము. మీరు మా సహాయ కేంద్రంలో Family Link, అలాగే మీ చిన్నారి Google ఖాతా లేదా ప్రొఫైల్ గురించి అదనపు సమాచారాన్ని కనుగొనవచ్చు. మీరు మెనూ ☰ > సహాయం & ఫీడ్‌బ్యాక్ > ఫీడ్‌బ్యాక్‌ను పంపండి లేదా ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అనే ఆప్షన్ ద్వారా లేదా కింద ఇవ్వబడిన అడ్రస్‌లో Family Link లేదా Family Link యాప్‌లో మీ చిన్నారి Google ఖాతా లేదా ప్రొఫైల్ గురించి మాకు ఫీడ్‌బ్యాక్‌ను పంపవచ్చు.
Google
1600 Amphitheatre Parkway
Mountain View, CA 94043 USA
ఫోన్: +1 855 696 1131 (USA)
ఇతర దేశాల వారు, g.co/FamilyLink/Contact లింక్‌ను సందర్శించండి
Google మీ చిన్నారికి చెందిన డేటాను ఎలా సేకరిస్తుంది, అలాగే ఎలా ఉపయోగిస్తుంది అనే దాని గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీరు Google, అలాగే మా డేటా రక్షణ ఆఫీస్‌ను సంప్రదించవచ్చు. స్థానిక చట్టం ప్రకారం మీ హక్కులకు సంబంధించి మీకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే, మీరు మీ స్థానిక డేటా ప్రొటెక్షన్ అథారిటీని కూడా సంప్రదించవచ్చు.